గుర్తింపు లేదని మాజీ ఎమ్మెల్యే మనస్తాపం? | Sakshi
Sakshi News home page

గుర్తింపు లేదని మాజీ ఎమ్మెల్యే మనస్తాపం?

Published Thu, Apr 18 2024 2:00 PM

ఎంపీలు, ఎమ్మెల్సీతో రాములునాయక్‌, నాయకులు - Sakshi

వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ ఇంటికి బుధవారం రాత్రి బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు వెళ్లారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఆయన ఉన్నట్లు తెలియడంతో ఖమ్మంలోని ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో సేవలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని రాములునాయక్‌కు వారు హామీ ఇచ్చారు. వైరా ఏఎంసీ చైర్మన్‌ పసుపులేటి మోహనరావు, నాయకులు మోరంపుడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రాములునాయక్‌ ఇంటికి వెళ్లిన

బీఆర్‌ఎస్‌ నేతలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement