అంతా రామమయం.. | Sakshi
Sakshi News home page

అంతా రామమయం..

Published Thu, Apr 18 2024 2:00 PM

- - Sakshi

శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించిన భక్తజనం
● కిక్కిరిసిన భద్రాచల పుణ్యక్షేత్రం ● హాజరైన పలువురు ప్రముఖులు

గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనం

భద్రాచలంలో బుధవారం జరిగిన శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మంగళవారం సాయంత్రమే చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామునే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మిథిలా స్టేడియంలో జరిగిన కల్యాణోత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ శాంతికుమారి ఏర్పాట్లపై కలెక్టర్‌ ప్రియాంక తదితరులు సమీక్షిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కాగా, కల్యాణానికి హాజరైన ప్రముఖుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం శ్రీనరసింహ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్‌, అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఎన్‌.హరినాథ్‌, శ్రీనివాసరెడ్డి, సుమతి, కిరణ్మయి, రవీంద్రనాథ్‌ తిల్‌హర్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కిషన్‌, ఎంపీ మాలోత్‌ కవిత, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, తెలంగాణ పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.హన్మంతరావు, మల్టీ జోన్‌–1 ఐజీ ఏవీ రంగనాథ్‌, జైళ్ల శాఖ ఐజీ వై.రాజేశ్‌, సింగరేణి సీఎండీ బలరామ్‌, మిషన్‌ భగీరథ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్రమోహన్‌, జిల్లా జడ్జి వసంత్‌ పాటిల్‌, కొత్తగూడెం సీనియర్‌ సివిల్‌ జడ్జి భానుమతి, జూనియర్‌ సివిల్‌ జడ్జి రామారావు, భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి సూరిరెడ్డి, ఖమ్మం జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జీవన్‌ కుమార్‌, ఇల్లెందు జూనియర్‌ సివిల్‌ జడ్జి కీర్తి చంద్రిక, ఖమ్మం ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి అర్చనాకుమారి, మణుగూరు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం అడిషనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శివనాయక్‌ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, టీటీడీ మాజీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజుతో పాటు దేవనాథ రామానుజ జీయర్‌స్వామి, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, దైవజ్ఞశర్మ తదితరులు ఉన్నారు. కాగా, ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, భద్రాచలం దేవస్థానం ఈఓ రమాదేవి, ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ / భద్రాచలం అర్బన్‌

1/1

Advertisement
 
Advertisement