రైతులు యాజమాన్య పద్ధతులు అవలంబించాలి | Sakshi
Sakshi News home page

రైతులు యాజమాన్య పద్ధతులు అవలంబించాలి

Published Wed, Apr 17 2024 12:35 AM

అభిలాష్‌ (ఫైల్‌)  - Sakshi

బోనకల్‌: పంటల సాగులో రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం జరిగిన రైతునేస్తం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పంటల సాగులో మెళకువలపై అవగాహన కల్పించాక డీఏఓ మాట్లాడారు. రైతులకు తమ పొలాల్లోని మట్టి నమూనా పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేయాలని సూచించారు. మధిర ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏఓలు సరిత, నాగయ్య, రాధ, శ్రీనివాసరావు, విజయ్‌బాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ఏడు నెలల క్రితమే వివాహం

రఘునాథపాలెం: సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తున్న యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఉగాది పండుగకు స్వస్థలానికి వచ్చిన ఆయన మృత్యువాత పడగా కుటుంబంలో విషాదం నెలకొంది. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంకు చెందిన ఎన్‌అభిలాష్‌(30) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా, ఏడు నెలల క్రితం హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతితో వివాహం జరిగింది. వీరిద్దరు ఉగాది పండుగకు వీ.వీ.పాలెం వచ్చారు. పండుగ తర్వాత ఆయన భార్య హైదరాబాద్‌ వెళ్లిపోగా.. అభిలాష్‌ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో బాత్‌రూంకు వెళ్లి వచ్చి మంచంపై కుప్పకూలాడు. దీంతో కుటుంబీకులు చూసేలోగా గుండెపోటుతో మృతి చెందినట్లు తేలింది. ఈమేరకు ఆయన తల్లిదండ్రులు రామలక్ష్మి, భిక్షంతో పాటు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement