బీఆర్‌.అంబేద్కర్‌కు అక్షర నివాళి | Sakshi
Sakshi News home page

బీఆర్‌.అంబేద్కర్‌కు అక్షర నివాళి

Published Sun, Apr 14 2024 12:45 AM

ఉపాధ్యాయుడు గీసిన అంబేద్కర్‌ చిత్రం - Sakshi

కల్లూరు: బీఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మైక్రో ఆర్టిస్ట్‌ దంతాల సుధాకర్‌ ప్రత్యేక ఆర్ట్‌(అక్షరాలతో బొమ్మలు చిత్రించడం) ద్వారా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చిత్రాన్ని రూపొందించాడు. ఎక్కడ గీతలు లేకుండా.. రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను వివరించే అక్షరాలతోనే ఈ బొమ్మ చిత్రించడం విశేషం. ఈ చిత్రం ఆధారంగా ఉపాధ్యాయుడు శనివారం విద్యార్థులకు అంబేద్కర్‌ జీవిత చరిత్రను వివరించారు.

ఇద్దరికి గాయాలు

తిరుమలాయపాలెం: మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపాన రెండు బైక్‌లు ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కేశ్వాపురానికి చెందిన ఈదుల రవి మోటార్‌సైకిల్‌పై శనివారం ఖమ్మం వెళ్తుండగా, వైరా మండలం గన్నవరానికి చెందిన కారుమంచి కృష్ణ మోటార్‌సైకిల్‌పై బాజినేని శ్రీనుతో కలిసి మరి పెడ బంగ్లా వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో తిరుమలాయపాలెం వద్ద రవి వాహనాన్ని కృష్ణ కొట్టాడు. ఈ ఘటనలో రవితో పాటు శ్రీనుకి తీవ్రగాయాలు కాగా వీరిని 108లో ఖమ్మం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అదుపుతప్పి కారు బోల్తా

నేలకొండపల్లి: మండల కేంద్రంలోని చెరువు కట్ట మూలమలుపు మీదుగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పొలాల్లో బోల్తా పడింది. ఖమ్మం నుంచి కోదాడ వైపు శనివారం కారు వెళ్తుండగా, కట్టలమ్మ చెరువు వద్ధ ప్రమాదం జరిగింది. తొలుత మూలమలుపు వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ పంటల పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. కాగా, అందులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనలో వారికి గాయాలు కాగా, ఖమ్మం వెళ్లినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement