పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి

Published Sun, Apr 14 2024 12:45 AM

మాట్లాడుతున్న టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన 
కార్యదర్శి నాగిరెడ్డి  - Sakshi

మధిర(చింతకాని): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. చింతకాని మండలం నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నాగులవంచ రైల్వేకాలనీ పీఎస్‌ హెచ్‌ఎం గుండా మధుకర్‌రెడ్డి ఉద్యోగ విరమణ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులను విడుదల చేయకపోగా తిరిగి వెనక్కి పంపడం సరికాదన్నారు. జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, మెడికల్‌, సరెండర్‌ లీవ్‌, పెన్షనర్ల బిల్లులను ఇకనైనా విడుదల చేయాలని కోరారు. అలాగే, ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలన్నారు. ఎంఈఓ మోదుగు శ్యాంసన్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు, నాయకులు జీవీబీ.రంగారెడ్డి, విజయ్‌, మల్లికార్జున్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు, పుల్లయ్య, చెన్నకేశవరెడ్డి, జలీల్‌పాషా, శ్రీనివాసరావు, గోవిందరెడ్డి, రత్నకుమారి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement