●మహా పుష్పాభిషేకం | Sakshi
Sakshi News home page

●మహా పుష్పాభిషేకం

Published Sun, Apr 14 2024 12:55 AM

స్వామికి మహాపుష్పాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు - Sakshi

ఖమ్మం 4వ డివిజన్‌ బాలాజీనగర్‌లోని స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి 20 వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం వసంతోత్సవం, చక్రస్నానం, మహాపుష్పాభిషేకంతో పాటు మహాపూర్ణహుతి వేడుకలను వేలాది మంది భక్తుల సమక్షాన ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాధుని రామాచార్యులు బృందం ఆధ్వర్యాన పూజలు చేయగా.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, మేయర్‌ నీరజ, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, మిక్కలినేని నరేంద్ర, హన్మంతరావు, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బొల్లి కొమరయ్య, పురం తిరుపతయ్య తదితరుల ఆధ్వర్యాన ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ఖమ్మంఅర్బన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement