పాలేరు నా సొంతిల్లు.. | Sakshi
Sakshi News home page

పాలేరు నా సొంతిల్లు..

Published Sun, Apr 14 2024 12:55 AM

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  - Sakshi

కూసుమంచి: ‘పాలేరు నా సొంతిల్లు... ఇక్కడి పార్టీ శ్రేణులు, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇక నుంచి వారానికోరోజు ప్రజలకు అందుబాటులో ఉంటాను. మిగిలిన సమయాల్లోనూ సమస్య నాకు తెలిసేలా రెండు మండలాలకు ఒకరి చొప్పున సిబ్బందిని నియమిస్తా. అలాగే, ప్రజలు సమస్యలసై నేరుగా ఫోన్‌ చేసేలా కొత్త నంబర్‌ ప్రకటిస్తా..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో శనివారం సమావేశమయ్యారు. తొలుత మండలాల వారీగా నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం మంత్రి మాట్లాడారు. పాలేరు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తాను మంత్రి అయ్యానని చెప్పారు. ఇప్పటికే పలు సమస్యలు పరిష్కరించినా, ఇంకా మిగిలినవి కూడా పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇక నుంచి పాలేరుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తానని, రెండు మండలాలకు ఒకరు చొప్పున 24గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్‌, తాగునీరు.. సమస్య ఏదైనా వెంటనే పరిష్కారమయ్యేలా వారు కృషి చేస్తారని చెప్పారు. ఇక వారానికోరోజు పాలేరులో పర్యటించి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, మిగతా సమస్యలు తనను నేరుగా సంప్రదించేలా కొత్త ఫోన్‌ నంబర్‌ అందుబాటులోకి తీసుకొస్తానని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

ఇకపై వారానికోరోజు

ప్రజలకు అందుబాటులో ఉంటా

సమస్య ఏదైనా నేరుగా ఫోన్‌ చేయొచ్చు

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మంత్రి వాహనం తనిఖీ

తిరుమలాయపాలెం: హైదరాబాద్‌ నుంచి తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట పర్యటనకు వస్తున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి వాహనాన్ని శనివారం ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్‌ వద్ద ఎస్‌ఎస్‌టీ(సర్వైలెన్స్‌ స్టాటిస్టికల్‌ టీం) అధికారులు, పోలీసులు.. మంత్రి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలకు మంత్రి సహకరించారు.

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement