
శ్రీనివాసాచారి(ఫైల్)
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రీడారంగంలో పేరున్న గ్రౌండ్స్‌మెన్ శ్రీనివాసాచారి మృతి చెందారు. తొలుత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్)లో గ్రౌండ్స్‌మెన్‌గా విధుల్లో చేరిన ఆయన క్రీడామైదానాలను సిద్ధం చేయడంలో మంచి పేరు సాధించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఏ టోర్నమెంట్ జరిగినా సేవలందించేవారు. మూడేళ్ల క్రితం రికార్డ్ అసిస్టెంట్‌గా పదోన్నతి లభించినా క్రీడా మైదానాల నిర్వహణలో సిబ్బందికి సూచనలు ఇచ్చేవారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చారి బుధవారం రాత్రి మృతి చెందారు. శ్రీనివాసాచారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఆయన మృతిపై డీవైఎస్‌ఓ టి.సునీల్ రెడ్డి, కోచ్‌లు, క్రీడా అసోసియేషన్ల బాధ్యులు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్‌అలీ, ఎం.డీ.మతిన్, ఓలేటి సాంబమూర్తి, పరిపూర్ణాచారి, సురేష్, కొండలరావు, నాగేశ్వరరావు, రఘునందన్, క్రిస్టోఫర్‌బాబు, ఆదర్శకుమార్, గోవిందరెడ్డి, ఉప్పల్‌రెడ్డి, రవి, వెంకన్న, శ్రీనివాస్, రాందాస్ తదితరులు సంతాపం ప్రకటించారు.