26 కేజీల గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

26 కేజీల గంజాయి పట్టివేత

Published Thu, Dec 21 2023 12:22 AM

-

బూర్గంపాడు: ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 26 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మండలంలోని లక్ష్మీపురంలోని లారీ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీపురంలోని ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్‌ వద్ద ఓ వ్యక్తి మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడనే సమాచారంతో ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇది గమనించిన వ్యక్తి మూడు బ్యాగులను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆ బ్యాగులను పరిశీలించగా 26 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. గంజాయి విలువ రూ.6.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హరీశ్‌, సుధీర్‌, వెంకటేశ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement