వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యం | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యం

Published Thu, Dec 21 2023 12:22 AM

-

కామేపల్లి: వ్యవసాయ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. బర్లగూడెం సమీపంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో గుర్తు తెలియని శవం కన్పించడంతో స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ బావిలో ఉన్న మృతదేహాన్ని స్థానికుల సాయంతో బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారుగా 40 ఏండ్లు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్నాడని, ఒంటిపై గోధుమ రంగు చారలు కలిగిన తెల్ల బనియన్‌, తెల్ల రంగు చొక్కా ధరించి ఉన్నాడని, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా భావించి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement