ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా... | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా...

Published Thu, Nov 16 2023 12:34 AM

- - Sakshi

● బాలలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ ● జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు ● ఈనెల 22న జిల్లా స్థాయిలో నిర్వహణ

ఖమ్మంసహకారనగర్‌: నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల నిర్వహణకు సిద్ధమయ్యారు. జాతీయ స్థాయిలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ), కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్‌సీఎస్‌సీ(జాతీయ శాస్త్ర, సాంకేతిక సమాచారం మండలి) 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నిర్వహిస్తుంది. జిల్లాలోని 419 పాఠశాలల్లో 82,925 మంది విద్యార్థులు ఉండగా.. ఎక్కువ మంది పాల్గొనేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించారు.

22న జిల్లా స్థాయి పోటీలు

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ 2023–24 పోటీలను ఈనెల 22వ తేదీన జిల్లా కేంద్రంలోని విన్‌ఫీల్డ్‌ హైస్కూల్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఏటా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తుండగా.. ప్రతీ రెండేళ్లకోసారి అందులోని ప్రధాన అంశం, ఉప అంశాలు మారుతుంటాయి. ఈ ఏడాది ఖమ్మం విన్‌ఫీల్డ్‌ హైస్కూల్‌(మధురానగర్‌ రోడ్‌ నెంబర్‌–4)లో ఈ సైన్స్‌ఫేర్‌ నిర్వహణకు నిర్ణయించారు.

అంశాలు ఇవే..

ఈ ఏడాది జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రధాన అంశంగా ‘ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’గా నిర్ణయించారు. అ లాగే, ఉప అంశాలుగా పర్యావరణ వ్యవస్థను తెలుసుకోండి, ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సును పెంపొందించడం, పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సామాజిక, సాంస్కృతిక పద్ధతులు, స్వీయ ఽఆధారితం కోసం పర్యావరణ వ్యవస్థ అధారిత విధానం, పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సాంకేతిక ఆవిష్కరణగా ప్ర కటించారు. ఇందులో ప్రధాన అంశంతో పాటు ఉప అంశాల్లో ఏదోఒకటి ఎంచుకోవాలి. ఇద్దరు విద్యార్థులు గైడ్‌ టీచర్‌ సాయంతో ఎంచుకున్న ఉప అంశానికి అనుగుణంగా సర్వే, పరిశీలన, ప్రశ్నావళి, కేస్‌ స్టడీస్‌ ఆధారంగా ప్రాజెక్ట్‌ రూపొందించాల్సి ఉంటుంది.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిస్తే...

ఈనెల 22వ తేదీన జరిగే జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ కూడా ప్రతిభ చాటితే జాతీయ స్థాయికి పంపిస్తారు. జూనియర్‌, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. కాగా, గత ఏడాది నిర్వహించిన జాతీయ బాలల కాంగ్రెస్‌కు 120 ప్రాజెక్టులు రాగా.. ఇందులో ఆరు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి.

అవగాహన కల్పిస్తున్నాం...

విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో ఎక్కువ ప్రాజెక్టులు తీసుకొచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. ఈ విషయంలో ఉపాధ్యాయులు కూడా సూచనలు చేయాలి. తద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దవచ్చు. – ఎనుమల వెంకటేశ్వర్లు,

జిల్లా కోఆర్డినేటర్‌, నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రాజెక్ట్‌తో విద్యార్థులు (ఫైల్‌)
1/2

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రాజెక్ట్‌తో విద్యార్థులు (ఫైల్‌)

2/2

Advertisement
Advertisement