నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన

Published Mon, Oct 9 2023 12:06 AM

ఖర్గేకు పుష్పగుచ్ఛం అందిస్తున్న 
రాయల నాగేశ్వరరావు - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి 10 గంటలకు భద్రాచలంలో సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు దగ్గర గోదావరి ఫ్లడ్‌ బ్యాంక్స్‌, అప్రోచ్‌ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. 10.20 గంటలకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కిచెన్‌ కాంప్లెక్స్‌, సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. 10.40 గంటలకు భద్రాచలం అంబేద్కర్‌ సెంటర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఖమ్మం చేరుకుని 3గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో గృహలక్ష్మి పథకం పత్రాలు, జీఓ 58 పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

ఖర్గేను కలిసిన ‘రాయల’

నేలకొండపల్లి : వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరరావు ఆదివారం ఢిల్లీలో కలిసి విన్నవించారు. గత తొమ్మిదేళ్లుగా పాలేరు డివిజన్‌లో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలకు అండగా ఉన్నానని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. తన పనితీరును పరిశీలించి కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వాలని కోరారు.

20 మందికి పదోన్నతులు

ఖమ్మం సహకారనగర్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 20మంది జూని యర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్‌ఏ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జోనల్‌ స్థాయి హోదా కలిగిన పోస్టు కావడంతో జోనల్‌ పరిధిలోని మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు కేటాయించగా.. ఆయా జిల్లాలోని కలెక్టర్లు వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

బచ్చోడును

మండల కేంద్రం చేయాలి

ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

తిరుమలాయపాలెం: బచ్చోడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని గ్రామస్తులు కోరారు. ఆదివారం రాత్రి బచ్చోడు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేను పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా అడ్డుకుని నిరసన తెలిపారు. రాష్ట్రంలో అనేక మండలాలు ప్రకటించినప్పటికి బచ్చోడు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే మండల కేంద్రం ప్రకటన చెయ్యాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే తెలిపారు. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. నిరసన తెలిపిన వారిలో మండల సాధన కమిటీ సభ్యులు రమేష్‌, నర్సయ్య, హన్మంతరావు, మల్లికార్జున్‌, మల్లయ్య, దయాకర్‌, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

‘సోషల్‌ వర్క్‌’లో డాక్టరేట్‌

ఖమ్మం సహకారనగర్‌ : నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల సోషల్‌ వర్క్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మట్టపల్లి వీరాంజనేయులుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించిందని ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ చేకూరి రామారావు తెలిపారు. డాక్టరేట్‌ వచ్చిన సందర్భంగా ఆదివారం కళాశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. వరంగల్‌ జోన్‌ పరిధిలోని ‘బాల నేరస్తుల తీవ్ర త, బాలుర పరిశీలన గృహంపై మ్యాగ్నిట్యూడ్‌ ఆఫ్‌ జువైనెల్‌ డిలిక్వెన్సీ ఇన్‌ తెలంగాణ’ అనే అంశంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్‌ పి వెంకటరమణ పర్యవేక్షణలో చేసిన పరిశోధన గ్రంధానికి డాక్టరేట్‌ వచ్చిందని తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన వీరాంజనేయులు గత పది సంవత్సరాలుగా సోషల్‌ వర్క్‌ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయాలు నిర్వహించిన ప్రాంతీయ, జాతీయ స్థాయిలో జరిగిన పలు సెమినార్లకు హాజరయ్యారని, వివిధ అంశాలపై తాను చేసిన పరిశోధన పత్రాలను సమర్పించారని అన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులును అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

ఎమ్మెల్యే కందాలను అడ్డుకుంటున్న 
బచ్చోడు గ్రామస్తులు
1/1

ఎమ్మెల్యే కందాలను అడ్డుకుంటున్న బచ్చోడు గ్రామస్తులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement