మంచుకొండ

- - Sakshi

బుగ్గవాగు కాదు..

బుగ్గవాగు వద్ద చెక్‌డ్యాం నిర్మించినా...

కామేపల్లి మండలం సమీపాన బుగ్గవాగు వద్ద గతంలో చెక్‌డ్యాం నిర్మించారు. ఇక్కడి నుంచి వరద నీటిని మళ్లించి కామేపల్లి మండలంలోని కొన్ని చెరువులతో పాటు రఘునాథపాలెం మండలంలోని 30కిపైగా చెరువులు నింపడానికి రూ.39.06కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందుకోసం కాల్వలు తవ్వాల్సి ఉండగా, భూసేకరణ అడ్డంకిగా మారడంతో ఏళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. రఘునాథపాలెం మండలంలో వ్యవసాయ భూమి ఎకరా ధర రూ.కోటి నుంచి రూ.3కోట్ల పైచిలుకు ఉండడంతో బుగ్గవాగు ద్వారా చెరువులకు నీరు మళ్లించడానికి కాల్వలు తవ్వేందుకు అవసరమైన భూమిని రైతులు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వం నుంచి అతితక్కువగా పరిహారం రానుండడంతో సర్వే కోసం పలుమార్లు వెళ్లిన జల వనరులశాఖ, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు కలెక్టర్‌తో చర్చించినప్పుడు రైతులు సుముఖంగా లేనప్పుడు తాత్కాలి కంగా నిలిపివేయాలని సూచించగా.. అప్పటి నుంచి కదలిక లేదు.

భూసేకరణ అవసరం లేకుండా..

వీ.వీ.పాలెంలోని సాగర్‌ కాల్వ డీప్‌ కట్‌ వద్ద నిత్యం నీరు నిల్వ ఉండడంతో లిఫ్ట్‌ నిర్మిస్తే ఎలాంటి భూసేకరణ చేయకుండానే పైపులైన్ల ద్వారా చెరువులకు నీరు సరఫరా చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏడు మోటార్లు ద్వారా సాగర్‌ కాల్వ నీటిని తోడి వీ.వీ.పాలెం నుంచి చింతగుర్తి వరకు ఎనిమిదిన్నర కి.మీ. మేర ఒక పైపులైన్‌, మంచుకొండ వరకు 11 కి.మీ. నిడివితో ఇంకో పైపులైన్‌ ఏర్పాటుచేసి చెరువులకు సరఫరా చేస్తారు. కాల్వల తవ్వకానికి మంజూరైన రూ.39.06 కోట్ల నిధులు ఉన్నందున, మరో రూ.40కోట్ల పైచిలుకు నిధులు వస్తే పథకం పూర్తికానుంది. ఇక పైపులైన్‌ కూడా రోడ్డు పక్కన నిర్మించేలా ప్రతిపాదనల్లో పొందుపర్చారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ ప్రణాళికు ఆమోదం తెలిపినందున ఒకటి, రెండు రోజుల్లో జీఓ విడుదలయ్యే అవకాశముందని తెలిపారు. గతంలో బుగ్గవాగుపై సుమారు రూ.5కోట్లతో చెక్‌ డ్యాం నిర్మించి ఉండడంతో దానిద్వారా కామేపల్లి మండలంలో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఎత్తిపోతల పథకం నిర్మించనున్న సాగర్‌ ప్రధాన కాల్వ పరిధిలోని వీ.వీ.పాలెం వద్ద డీప్‌ కట్‌

రూ.80 కోట్లతో

కొత్త ఎత్తిపోతల పథకం

వీ.వీ.పాలెం సాగర్‌ డీప్‌ కట్‌పై

నిర్మాణానికి ప్రణాళిక

31 చెరువులకు సాగర్‌ జలాలు.. 2,500 ఎకరాల ఆయకట్టు

భూసేకరణ లేకుండానే పైపులైన్‌ ద్వారా పారించేలా రూపకల్పన

ఇప్పటికే సిద్ధంగా

రూ.30కోట్ల పైచిలుకు నిధులు

నాగార్జునసాగర్‌ ద్వారా జిల్లాలో మరింత ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇందుకోసం కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సాగర్‌ ప్రధాన కాల్వ సాగుతున్న రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ సమీపాన వీ.వీ.పాలెం డీప్‌ కట్‌ వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. అనంతరం ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండానే రెండు పైపులైన్ల ద్వారా రఘునాథపాలెం మండలంలోని 31 చెరువులకు సాగునీరు అందించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిర్మాణంతో కొత్తగా 2,500 ఎకరాల భూమికి పుష్కలంగా సాగునీరు అందించొచ్చని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. – ఖమ్మంఅర్బన్‌

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top