బళ్లారి అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడం సమాజ బాధ్యత అని బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అన్నారు. నగరంలోని బీడీఏఏ గ్రౌండ్ ఆడిటోరియంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని 7 ఎయిడెడ్ కళాశాలలకు చెందిన 129 మంది విద్యార్థులకు ట్రస్ట్ స్కాలర్‌షిప్స్ అందజేసిందని తెలిపారు. విద్యార్థులకు ఈ సహాయం ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు సహాయం చేయాలని ట్రస్ట్ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో మెహతాబ్, ఎర్రిస్వామి, కప్పగల్లు చంద్రశేఖర్ ఆచార్, ఎమ్మిగనూర్ జగదీష్, కాంగ్రెస్ నాయకుడు సుబ్బరాయుడు, కళాశాల ప్రిన్సిపల్‌లు విద్యార్థులు పాల్గొన్నారు.


