అంబేడ్కర్‌కు నివాళి
కోలారు: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని బంగారుపేట సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదర్గాలకు అంబేడ్కర్ అందించిన సేవలు అపారమని, అన్ని సముదాయాల వారికి అనుకూలమయ్యే రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎల్.అనిల్‌కుమార్, జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ ప్రవీణ్ పిబాగేవాడి, జిల్లా ఎస్పీ డాక్టర్ బి.నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
దుకాణాల తనిఖీ
శ్రీనివాసపురం: ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలనే సంకల్పంతో పుర సభ అధికారులు పట్టణంలోని బేకరి, పండ్లు, హోటల్, కూరగాయల దుకాణాలను దుకాణాలను శనివారం తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడరాదని యజమానులను హెచ్చరించారు. ఎంజీ రోడ్డులోని ఫుట్‌పాత్‌ను తొలగించి, ముళబాగిలు సర్కిల్‌లో చెత్త వేసే స్థలంలో ముగ్గులు వేయించారు. అనంతరం 25 కిలోల ప్లాస్టిక్ స్వాధీనం చేసుకుని దుకాణదారులకు రూ.3 వేల జరిమానా విధించారు. పురసభ పరిసర సూపరింటెండెంట్ లక్ష్మీశ, హెల్త్ సూపర్‌వైజర్ టీవీ.సురేష్, సిబ్బంది సంతోష్, నాగేష్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


