కరాటేలో డేవిడ్‌కు స్వర్ణ పతకం
రాయచూరు రూరల్: కరాటే పోటీల్లో రాయచూరుకు చెందిన డేవిడ్ స్వర్ణ పతకం సాధించాడు. గతనెల 30వ తేదీన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నగరానికి చెందిన డేవిడ్‌్ పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఎంఎస్.జావిద్ శాటోకన్ జాతీయ కరాటే అవార్డును గ్రాండ్‌మాస్టర్ షాహిద్, ప్రధాన కార్యదర్శి సుభాన్ చేతుల మీదుగా అందుకున్నాడు.
తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం
● భయాందోళనలో గ్రామ ప్రజలు
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా మద్లాపుర వద్ద శనివారం తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో మొసలి ప్రత్యక్షం కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు వన్య జీవులు, జలచరాల నుంచి ప్రజలను రక్షించడానికి అటవీ శాఖాధికారులకు వెంటనే సమాచారం అందించాలని డిమాండ్ చేశారు.
హాస్టల్‌లో విద్యార్థులపై దాడి
రాయచూరు రూరల్: ప్రభుత్వ సాంఘీక సంక్షేమ శాఖ హాస్టల్‌లోని విద్యార్థులపై అధికారులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ హాస్టల్‌లో వార్డెన్, సిబ్బంది కలిసి విద్యార్థులపై దాడి చేయడంతో భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న పిల్లలను ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో హింసకు గురి చేస్తున్నారు. 125 మంది విద్యార్థులకు గాను 80 మంది విద్యార్థులున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. విద్యార్థులు అధికారులను పెన్సిల్, పెన్నులు, పుస్తకాలు అడిగితే వారిని చితకబాదినట్లు సమాచారం. విద్యార్థులకు యూనిఫాం, షూ, పుస్తకాలు, కిట్లు ఇవ్వకుండా, హాస్టల్‌లో సీసీ టీవీలు, మంచినీటి ప్లాంట్ చెడిపోయినా మరమ్మతు చేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముక్తి రథం వాహనం పంపిణీ
రాయచూరు రూరల్: దళితుల శవ సంస్కారానికి వీలుగా ముక్తి రథం వాహనాన్ని శనివారం విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పంపిణీ చేశారు. నగరంలోని హరిజనవాడల్లో మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించడానికి వీలుగా రూ.20 లక్షలతో రెండు శవపేటికలు, ముక్తి రథం వాహనాన్ని ఆయన అందించారు. ఈ సందర్భంగా మాదార చెన్నయ్య గురు పీఠం అధ్యక్షుడు యమనూరప్ప, బసవరాజ, రామణ్ణ, సత్యనాథ్, వెంకటేష్, బాబు, తిమ్మప్ప, మాజీ నగరసభ సభ్యుడు యల్లప్ప, అస్లాంపాషా, మురళీ యాదవ్, మహ్మద్ హుసేన్, రజాక్ ఉస్తాద్‌లున్నారు.
వాలంటీర్ల దినోత్సవం
రాయచూరు రూరల్: మాదార చెన్నయ్య ఆడిటోరియంలో మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్, నెస్లే ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత వాలంటీర్ల దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో రాయచూరు గ్రీన్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, సమాజ అభివృద్ధి, నాయకత్వంపై యువతీ యువకులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఈరణ్ణ, చంద్రశేఖర్, గూళప్ప, కాశీనాథ్, నరసప్ప, సురేష్‌లున్నారు.
కరాటేలో డేవిడ్‌కు స్వర్ణ పతకం
కరాటేలో డేవిడ్‌కు స్వర్ణ పతకం
కరాటేలో డేవిడ్‌కు స్వర్ణ పతకం
కరాటేలో డేవిడ్‌కు స్వర్ణ పతకం


