రెండు మూడు నెలల కిందటే టికెట్‌ను బుక్ చేసుకున్నారు. చా
నిలిచిపోయిన
ఇండిగో విమానాలు
ఇతర విమానాలు, ప్రైవేటు బస్సుల్లో మోత
దొడ్డబళ్లాపురం: సిలికాన్ సిటీలోని కెంపేగౌడ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. నిత్యం రచ్చ రచ్చ అవుతోంది. ఇండిగో విమానాల సంక్షోభమే దానికి కారణం. తాజాగా శనివారం కూడా 32కు పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఇళ్లకు తిరిగి వెళ్లలేక, అక్కడే ఉండలేక నరకయాతన పడ్డారు.
బస్టాండు కంటే అధ్వానం
● ప్రయాణికులు భారీగా చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ విమానాశ్రయం సాధారణ బస్టాండును తలపించింది. ప్రయాణికులు అలసిపోయి ఎక్కడబడితే అక్కడ పడుకుని సేదతీరుతున్న దృశ్యాలు కనిపించాయి.
● ఇండిగో కౌంటర్లలో సిబ్బంది ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. కొందరు కోపం పట్టలేక కొట్లాటకు దిగారు. ఎటుచూసినా కోలాహలం కనిపిస్తోంది.
● వృద్ధ మహిళలు, పిల్లల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, మంచినీటి వసతి లేదు, కొందామంటే వాటి ధరలు వేల రూపాయల్లో ఉంటున్నాయని చెప్పారు.
● పగవారికి కూడా ఇలాంటి బాధలు వద్దనేలా పరిస్థితి ఉంటోంది. అనేకమంది ప్రయాణికులు తమ గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకున్నారు.
● నా జీవితంలో ఇలాంటి దుస్థితిని చూడలేదని ఓ ప్రయాణికుడు చెప్పారు. పరీక్షలకు, ఇంటర్వ్యూలకు, అత్యవసర కుటుంబ పనుల మీద వెళ్లేవారు తీవ్ర ఆవేదన చెందారు.
● ఘర్షణలు జరగకుండా ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచారు.
ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్‌లైన్స్ విమానాల టికెట్ల ధరలతో పాటు ప్రైవేటు బస్సుల చార్జీలు కూడా అమాంతం పెరిగాయి.
బాధిత ప్రయాణికులు అనేకమంది బస్సుల్లో ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో బెంగళూరు నుంచి వెళ్లే ప్రైవేటు బస్సుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఉదాహరణకు బెంగళూరు నుంచి ముంబైకి బస్ టికెట్ ధర రూ.1500 నుంచి రూ.2,500 ఉండగా ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు.
ఇతర నగరాలకు కూడా ధరలు భగ్గుమంటున్నాయి. రెండు విధాలా దోపిడీకి గురవుతున్నట్లుప్రయాణికులు వాపోయారు.
బెంగళూరు కెంపేగౌడ
ఎయిర్‌పోర్టులో తగ్గని గందరగోళం
ఇష్టానుసారం
ఇండిగో విమానాల క్యాన్సిల్
ప్రయాణికులకు తీవ్ర అవస్థలు
రెండు మూడు నెలల కిందటే టికెట్‌ను బుక్ చేసుకున్నారు. చా
రెండు మూడు నెలల కిందటే టికెట్‌ను బుక్ చేసుకున్నారు. చా


