ప్రాణం తీసిన పొగ మంచు
కనగానపల్లి: యువతిని పొగమంచు బలితీసుకుంది. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో 44వ జాతీయ రహదారిలో జరిగింది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్‌కు చెందిన రాళ్లపలి ధర్మరావు, కుష్మా దంపతుల కుమార్తె రాళ్లపల్లి వినీల (35) సైకాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. బెంగళూరులో ఉద్యోగ అన్వేషణలో ఉంది. శనివారం తెల్లవారుజామున బెంగళూరులో బంధువుల ఇంటిలో ఉన్న స్కూటర్‌ను తీసుకొని హైదరాబాద్ కు బయల్దేరింది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో పది మీటర్ల దూరంలో ఏముందనేది కూడా తెలియని విధంగా మంచు కప్పేసింది. ఈక్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఇనుప కమ్మీలను ఆమె ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో వినీల తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మరణించింది. కనగానపల్లి పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు
స్కూటర్‌లో పయనం
హైవే పక్కన ఇనుప కమ్మీలను
ఢీకొని యువతి దుర్మరణం
ప్రాణం తీసిన పొగ మంచు


