పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి | - | Sakshi
Sakshi News home page

పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి

Dec 2 2025 7:32 AM | Updated on Dec 2 2025 7:32 AM

పేదలు

పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి

రాయచూరు రూరల్‌ : పేదలు ఉచిత వైద్య పరీక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విధాన పరిషత్‌ సభ్యుడు శరణేగౌడ బయ్యాపుర పిలుపునిచ్చారు. సోమవారం లింగసూగూరులోని గడియారం సర్కిల్‌లో అంజుమ్‌ ఏ ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్‌, టిప్పుసుల్తాన్‌ జయంతి, పైగంబర్‌ జయంతుల సందర్భంగా సప్తగిరి ఆస్పత్రి జట్టు నుంచి ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా పేదలకు ఆర్థిక భారం తగ్గించినట్లు అవుతుందన్నారు. గుండెపోటు, క్యాన్సర్‌, మూల వ్యాధి, మూత్ర పిండాలు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు, ముక్కు, గొంతు, చెవిలకు ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి, నగర యోజన ప్రాధికార అధ్యక్షుడు భూసన గౌడ, కమిటీ సభ్యులున్నారు.

ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలి

రాయచూరు రూరల్‌: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు విద్యా రంగం పునాది కావాలని శివ కుమారస్వామి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని రామలింగేశ్వర ఆలయంలో జనని కళా సాంస్కృతిక బళగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా చిగురు కార్యక్రమాన్ని తబలా వాయించి మాట్లాడారు. పిల్లల సంక్షేమ కోసం పాటు పడాలన్నారు. ప్రతిభకు తగ్గట్టుగా భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. పిల్లలకు సంప్రదాయం, ఆచార విచారాల గురించి నేర్పాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి, విరుపాక్షయ్య స్వామి, వీరేష్‌, నాగరాజ్‌లున్నారు.

వేడుకగా లక్ష దీపోత్సవం

రాయచూరు రూరల్‌: తాలూకాలోని దేవసూగూరులో సూగూరేశ్వర లక్ష దీపోత్సవం వేడుకగా జరిగింది. ఆదివారం రాత్రి దేవసూగూరు ఆలయంలో రాయచూరు రూరల్‌ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఎస్‌ఎన్‌ఆర్‌ ఆస్పత్రి తనిఖీ

కోలారు: నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్‌ జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులకు అందించే సేవలు, మందుల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం రక్త పరీక్షకు ఇస్తే మధ్యాహ్నం మూడు గంటలకు రిపోర్టు ఇస్తారని రోగులు ఫిర్యాదు చేయగా.. రిపోర్టులు త్వరగా అందేలా చూడాలని డాక్టర్‌ జగదీష్‌కు ఎమ్మెల్యే సూచించారు. తనకు పింఛను రావడంలేదని వృద్ధురాలు ఫిర్యాదు చేయగా. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫించన్‌ అందేలా చూడాలని సూచించారు. ప్రాంగణంలో అనధికార దుకాణాలు తెరచి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్కటి పార్కింగ్‌ వ్యవస్థ ఏర్పాటుచేయాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సూచించారు.

పాలనావేత్త కెంగల్‌: సీఎం

శివాజీనగర: విధానసౌధ ఆవరణలో సోమవారంమాజీ ముఖ్యమంత్రి కెంగల్‌ హనుమంతయ్య విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా సీఎం సిద్దరామయ్య నివాళులు అర్పించారు. హనుమంతయ్య ఉత్తమ పరిపాలనావేత్త. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తీవ్ర సమస్యలకు పరిష్కారం కనిపెట్టారన్నారు. విధానసౌధ నిర్మాణానికి హనుమంతయ్య పునాది వేశారన్నారు. ప్రభుత్వ పని దేవుని పని అంటూ విధానసౌధపై రాయించిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఉపాధ్యాయుల గైర్హాజరుపై ధర్నా

రాయచూరు రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల గైర్హాజరు, ఆలస్యంగా విధులకు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు పూనుకున్నారు. సోమవారం యాదగిరి జిల్లా వడగేర తాలూకా కొంకల్‌లో విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి గేట్‌ ముందు భాగంలో నిరవధిక ధర్నా చేపట్టారు. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా పాఠ్యాంశాలు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. 258 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నలుగురు అతిథి ఉపాధ్యాయులున్నా ఫలితం లేదని, అలాంటి వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

పేదలు వైద్య శిబిరాల  లబ్ధి  పొందాలి1
1/3

పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి

పేదలు వైద్య శిబిరాల  లబ్ధి  పొందాలి2
2/3

పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి

పేదలు వైద్య శిబిరాల  లబ్ధి  పొందాలి3
3/3

పేదలు వైద్య శిబిరాల లబ్ధి పొందాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement