కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కంఠీరవలో బాలల నృత్యాభినయం
బెంగళూరు కంఠీరవ మైదానంలో జరిగిన రాజ్యోత్సవాలలో చిన్నారులు
బాగల్‌కోటలో జరిగిన వేడుకలలో కళా వైభవం
సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా కర్ణాటక మీద సవతి తల్లి ధోరణిని అవలంబిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. మాతృభాషలోనే విద్యను అందించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కన్నడ భాష, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచస్థాయిలో నిలబెడుతామని అన్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వచే 70వ రాష్ట్రావతరణ (రాజ్యోత్సవ) వేడుకలు వైభవంగా జరిగాయి. సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్‌డీఏ సర్కార్ కన్ననాడుపై సవతి తల్లి ప్రేమను చూపుతోంది, కేంద్రానికి కర్ణాటక నుంచి రూ. 4.5 లక్షల కోట్లు ఇప్పటివరకు పన్నుల రూపంలో వెళ్తే, నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
హిందీని రుద్దుతోంది
హిందీ భాషను తమపై రుద్దేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగుతున్నాయని, కన్నడతో పాటు దేశంలోని మిగిలిన భాషలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, పథకాలు, కార్యక్రమాలను కూడా ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. కన్నడ భాషకు శాసీ్త్రయ భాష హోదా ఇచ్చినప్పటికీ, రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని, ప్రజలు కూడా తీవ్రంగా ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాల్లో అధికారాన్ని కబ్జా చేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆరోపించారు.
కన్నడకు పెద్ద కష్టం
ప్రపంచంలో ఏ భాషకు లేని కష్టం ప్రస్తుతం కన్నడ భాషకు వచ్చిందని సీఎం అన్నారు. ప్రజలు తమ మాతృభాషల్లోనే ఆలోచిస్తారని, నేర్చుకుంటారని, కలలు కంటారని, కానీ మన దగ్గర మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని వాపోయారు. మాతృభాషలోనే చదువులు సాగేలా చట్టాలు రావాలని ఆకాంక్షించారు.
అభివృద్ధికి పెద్దపీట
కర్ణాటక రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. విద్యావ్యవస్థకు భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. కర్ణాటక ఏకీకరణకు కృషి చేసిన ఎందరో మహనీయులను స్మరించుకోవాలని, వారందరి త్యాగ ఫలితమే ఈ నాటి కర్ణాటక అని కొనియాడారు. పెట్టుబడుల విషయంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా కన్నడనాడులో ఉద్యోగాలు పోకుండా చూస్తామని చెప్పారు.
బెంగళూరు కంఠీరవలో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం, డీసీఎం
బెంగళూరు కంఠీరవలో ఉత్సాహకర విన్యాసం
ధార్వాడలో బాల బాలికల నృత్య ప్రదర్శన
సవతి తల్లిలా చూస్తోంది
సీఎం సిద్దరామయ్య నిప్పులు
రాజ్యోత్సవాలలో కేంద్రంపై మండిపాటు
రాజ్యోత్సవ అవార్డుల ప్రదానం
రాజ్యోత్సవ అవార్డుకు తాను ఎవరి పేరును సిఫార్సు చేయలేదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఎంపిక కమిటీ తీర్మానం అంతిమమని, ఇందులో భాగంగానే 70 మందిని రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం కన్నడ, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుల ప్రదానం రవీంద్ర కళాక్షేత్రంలో జరిగింది. విజేతలను సీఎం సన్మానించారు. అవార్డు రాలేదనుకున్నవారు నిరాశ పడకూడదని, మున్ముందు అవార్డును తప్పనిసరిగా అందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎం డీకే శివకుమార్ కన్నడ, సంస్కృతి మంత్రి శివరాజ్ తంగడగి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కేంద్రమా.. ఇంత అన్యాయమా?
కేంద్రమా.. ఇంత అన్యాయమా?


