అమ్మ సృష్టించిన రక్తపాతం
మైసూరు: చిన్నారులను కడుపులో పెట్టుకుని పోషించే తల్లి క్షణికావేశంలో ఘోర నిర్ణయం తీసుకుంది. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను పాశవికంగా గొంతుకోసి హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకుంది. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా బెట్టదపురలోని ముస్లిం వాడలో జరిగింది. అరేబియా (22) అనే మహిళ ఈ కిరాతక చర్యకు పాల్పడింది.
భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ
వివరాలు.. ఈమెకు మూడేళ్ల కిందట ఆరేనహళ్లికి చెందిన మూసావిర్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి ఏడాదిన్న కొడుకు ఉన్నాడు. మళ్లీ గర్భం దాల్చడంతో బెట్టదపురలోని పుట్టింటికి వచ్చి తొమ్మిది రోజుల క్రితం కొడుక్కి జన్మనిచ్చింది. శనివారం భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ గొడవ పడిన అరేబియా ఆగ్రహంతో అలాగే లోనికి వెళ్ళింది. 9 రోజుల పసికందును, మరో కొడుకును కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసింది. తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకి రాకపోగా పిల్లల శబ్దం కూడా రాలేదు, కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్ళి చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. చిన్నారుల శవాలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి భయకంపింతులయ్యారు. ఆమె తండ్రి జమృత్‌పాష బెట్టదపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
నవజాత శిశువు, మరో తనయుడు (ఫైల్)
పసికందు, కొడుకును గొంతు కోసి హత్య
ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య
మైసూరు జిల్లాలో ఘోర విషాదం
అమ్మ సృష్టించిన రక్తపాతం
అమ్మ సృష్టించిన రక్తపాతం


