ఉగ్రవాదికి నకిలీ ఆధార్
హుబ్లీ: తమిళనాడులోని కోయంబత్తూరులో 27 ఏళ్ల క్రితం సంభవించిన పేలుళ్ల కేసులో నిందితుడైన తమిళనాడు నివాసి, ఉగ్రవాది టైలర్ రజా అలియాస్ రజా సిద్దికిని కర్ణాటకలో విజయపురలోని ఓ ఇంట్లో తమిళనాడు పోలీసులు ఈ ఏడాది జూలై 8న అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు బాడుగకు ఉన్న ఇంటిలో తాజాగా పోలీసులు సోదాలు చేయగా నకిలీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, గ్యాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్‌లు పట్టుబడ్డాయి.
మారుపేర్లతో సంచారం
కాగా ఈ ఘరానా ఉగ్రవాది వివరాలలోకి వెళితే.. 1998లో కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోగా 250 మంది గాయపడ్డారు, అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ, మహారాష్ట్రలోని కొల్హాపురలో టైలరింగ్ నేర్చుకొని అక్కడ వేరే పేరుతో కొన్నేళ్లుగా ఉండేవాడు. 2014లో విజయపురకు వచ్చిన టైలర్ రజా సిద్దికి హుబ్లీ, ఆలమేల, విజయపుర నగరంలో మకాం చేశారు. షాజహాన్ షేక్ పేరుతో విజయపుర ఏపీఎంసీలో హోల్‌సేల్ కాయగూరల వ్యాపారం చేయసాగాడు, నకిలీ ఆధార్, ఇతర పత్రాల తయారీలో స్థానికులు సహకరించి ఉంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విజయపురలో తమిళనాడు పోలీసుల సోదాల్లో వెలుగులోకి


