
రౌడీ హత్య కేసులో ఎమ్మెల్యే విచారణ
శివాజీనగర: రౌడీషీటర్ బిక్లు శివ హత్య కేసులో హైకోర్టు సూచనల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ శనివారం భారతీనగర పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తనకు నోటీసులు ఇవ్వడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్ నుంచి తన పేరును రద్దు చేయాలని కోరారు. విచారించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడచుకోవాలని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. ఈ కేసులో మరో ముఖ్య నిందితుడు జగదీశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎమ్మెల్యే భైరతిని కూడా నిందితునిగా చేర్చారు. కొన్ని గంటలపాటు ఆయనను విచారిచారు.
నాపై బురదచల్లుడు: ఎమ్మెల్యే
నాకు, హత్య కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఏమీ తెలియదు, ఆ భూమి గొడవేమిటో నాకు తెలియదని ఎమ్మెల్యే భైరతి మీడియాతో చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో నన్ను ఇరికించారు. నాపై బురద చల్లేందుకు ఈ పని చేశారని ఆరోపించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎఫ్‌ఐఆర్ నుంచి నా పేరు తొలగించే వరకూ పోరాటం చేస్తానని తెలిపారు.

రౌడీ హత్య కేసులో ఎమ్మెల్యే విచారణ