
చిరుత దాడిలో 13 గొర్రెల మృతి
హొసపేటె: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలో కొన్ని రోజుల క్రితం అదే ప్రాంతంలోని గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి పొలంలో పని చేస్తున్న రైతుపై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెలజేరి గ్రామంలో చిరుతపులి దాడి చేసి సుమారు 13 గొర్రెలను చంపి తినింది. నెలజేరి గ్రామానికి చెందిన దేవప్ప నేవినాగిదాడకు చెందిన 13 గొర్రెలు చిరుతపులి దాడిలో మృతి చెందాయి. దేవప్ప కట్టివేసిన గొర్రెలపై చిరుత పులి దాడి చేసింది. దీంతో రైతుకు లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. సంఘటన స్థలాన్ని సందర్శించిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని కూడా వారు హామీ ఇచ్చారు.
చిరుత బెడదను నివారించాలని డిమాండ్
చిరుత గ్రామంలోకి రావడంతో రైతులు తమ ఆవులు, దూడలు, గేదెలు, మేకలు, గొర్రెలు మేపడానికి భయపడుతున్నారు. చిరుతపులి దాడి కారణంగా తాము ఇప్పటికే తమ పెంపుడు జంతువులను కోల్పోయాం. చిరుతపులి దాడులను నివారించడానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.