
త్వరలో గడిగి చెన్నప్ప సర్కిల్ ప్రారంభం
బళ్లారి అర్బన్: నగర నడిబొడ్డులోని గడిగి చెన్నప్ప సర్కిల్ పనులను అత్యంత నాణ్యతతో పూర్తి చేస్తున్నామని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో స్థానికులు సహకరించాలని కోరారు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదని అన్నారు. నాణ్యతతో నిర్మాణ పనులు చేయాలన్న సదుద్దేశంతోనే ఈ పనులకు తగినంత సమయం పడుతోందన్నారు. అంత వరకు ఎవరు ఎంత ఒత్తిడి చేసినా నాణ్యతతో పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు. పనిలో జాప్యంపై అనేక సమస్యలు వచ్చాయి. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. సదరు పనులకు ప్రభుత్వ అనుమతి కూడా ఆలస్యమైంది. అందువల్ల సర్కిల్ ప్రారంభం ఆలస్యం ఉందని, స్థానికులు సహకరించాలని ఆయన కోరారు.