
సిగందూరు కేబుల్ వంతెన నేడు ప్రారంభం
శివమొగ్గ: దేశంలో అతి పెద్ద కేబుల్ బ్రిడ్జి గా పేరు పొందిన సిగందూరు చౌడేశ్వరి దేవి వంతెనను సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరులో శరావతి నది మీద ఈ వంతెనను సుమారు రూ. 470 కోట్లతో నిర్మాణం చేయడం తెలిసిందే. సోమవారం ఘనంగా ప్రారంభోత్సవం చేసి, సాగర పట్టణంలో నెహ్రూ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. పలువురు కేంద్రమంత్రులు, ఎంపీ బీవై రాఘవేంద్ర, మాజీ సీఎం యడియూరప్ప పాల్గొంటారు. వంతెనను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.