
గన్‌తో బెదిరించి నగల దోపిడీ
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో దోపిడీదారులు రెచ్చిపోయారు. పట్టపగలు జువెలరీ దుకాణంలోకి చొరబడి 3కేజీల బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. కలబుర్గి పట్టణంలోని సరాఫ్ బజార్‌లో జువెలరీ దుకాణం ఉంది. ముసుగలు ధరించిన దుండగులు లోపలకు చొరబడి గన్‌లు చూపించి సిబ్బందిని బెదిరించారు. అనంతరం బంగారు ఆభరణాలను మూటగట్టుకొని ఉడాయించారు. సుమారు 3కేజీల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ద్వారా దొంగల ఆనవాళ్లను గుర్తించి గాలింపు చేపట్టారు.

గన్‌తో బెదిరించి నగల దోపిడీ