
యువకుడి దారుణ హత్య
శివమొగ్గ : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన శివమొగ్గ నగర శివారులోని బొమ్మనకట్టే లేఔట్‌లోని ఇ బ్లాక్‌లోని ఒక ఇంటి ఆవరణలో జరిగింది. హతుడిని బొమ్మనకట్టే ప్రాంతానికి చెందిన పవన్(28)గా గుర్తించారు. అతను టైల్స్ అచ్చువేసే పని చేసేవాడు. గురువారం రాత్రి పవన్.. శివకుమార్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు అక్కడే మద్యం సేవించి భోజనం చేశారు. ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో పవన్‌పై దాడి చేశారు. తీవ్ర గాయపడిన పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ సంతోష్‌కుమార్, సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వినోభానగర్ పోలీసులు పవన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.