
తుంగభద్ర హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయం నుంచి కుడి ఎగువ కాలువ(హెచ్‌ఎల్‌సీ)కు తుంగభద్ర మండలి అధికారులు గురువారం నీటిని విడుదల చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసే ముందు మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్ క్రస్ట్‌గేట్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం క్రస్ట్‌గేట్లను స్విచాన్ చేసి పైకెత్తి తొలుత 100 క్యూసెక్కుల మేర నీటిని కాలువకు వదిలారు. అనంతరం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ కోటా కింద 500 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతామన్నారు.
జెస్కాం అధికారిపై దాడి.. వ్యక్తి అరెస్ట్
రాయచూరు రూరల్: జిల్లాలో జెస్కాం అధికారిపై దాడి చేసిన వ్యక్తిని దేవదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. దేవదుర్గ తాలూకా మసరకల్ జెస్కాం ఇంజినీర్ మిథున్‌పై కరడిగుడ్డ రాజకుమార్ దాడి చేశారు. అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని పట్టుకున్నారు. కరడిగుడ్డలో ఇంటికి దొంగతనంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. మరో వైపు జీపీ అధ్యక్షురాలి బంధువు అంటూ అన్ని పనుల్లో జోక్యం చేసుకోవడాన్ని ఇంజినీర్ తప్పుబట్టారు. దీంతో తనపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.
నిధుల సద్వినియోగానికి సూచన
రాయచూరు రూరల్: జిల్లాలో అధికారులు ఎస్‌సీపీ, టీఎస్పీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లాధికారి నితీష్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ జనాభాకు తగ్గట్లుగా లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలన్నారు. క్రీడా శాఖ నుంచి అథ్లెటిక్ పోటీలను ఏర్పాటు చేయాలన్నారు. యువకులు మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలన్నారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, అధికారులు నవీన్ కుమార్, వీరేష్ నాయక్, చంద్రకళ, శ్రీదేవి, రాజేంద్ర, రవిలున్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.6.15 లక్షల వంచన
హుబ్లీ: వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి ఆ సదరు వ్యక్తి రూ.6.15 లక్షలు వంచించారు. పింటో బాధితుడు. క్రైం బ్రాంచ్ ముంబై నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మీ పైన మనీ ల్యాడరింగ్ కేసులు ఉన్నాయని చెప్పి భయ పెట్టి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని ఆ నగదును ఆన్‌లైన్ కేటుగాళ్లు బదలాయించుకున్నట్లు బాధితుడు పింటో స్రైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో ఆధార్ కార్డును అప్‌డేట్ చేయాలని నమ్మించి ఓ వ్యక్తికి ఆన్‌లైన్ కేటుగాళ్లు యాప్ డౌన్‌లోడ్ చేయించి రూ.4.83 లక్షలను వంచించారు. ప్రసన్న అనే వ్యక్తి బాధితుడు. ప్రసన్నకు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు అప్ డేట్ చేయించక పోతే మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆన్‌లైన్ కేటుగాళ్లు ఫోన్‌లో బెదిరించారు. ఆ మేరకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్మును కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారని బాధితుడు విద్యానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. సదరు విద్యార్థినికి అసభ్యంగా సైగలు చేసిన ఆరోపణలపై ఓ యువకుడిపై విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని సాయినాథ్‌గా గుర్తించారు. కేఎంసీ ఆస్పత్రి వెనుక ప్రాంతంలో విద్యార్థిని వెళుతుండగా నిందితుడు అసభ్యంగా సైగలు చేసి వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆంగ్ల బడుల మంజూరు తగదు
రాయచూరు రూరల్: ప్రభుత్వ కన్నడ పాఠశాలల్లో ఆంగ్ల భాషను బోధించేందుకు ఆంగ్ల భాష పాఠశాలలను మంజూరు తగదని కన్నడ మిత్ర కూట పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బషీర్ హొసమని మాట్లాడారు. రాష్ట్రంలో 4143 ఆంగ్ల మాధ్యమ భాష పాఠశాలకు అనుమతివ్వడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నడ భాష పాఠశాలలకు ప్రాధాన్యత కల్పించకుండా ఆంగ్ల భాషా పాఠశాలలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.

తుంగభద్ర హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల

తుంగభద్ర హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల

తుంగభద్ర హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల