
ధర్మస్థల సంస్థ సేవలు ప్రశంసనీయం
బళ్లారిఅర్బన్: డాక్టర్ వీరేంద్ర హెగ్డే, హేమావతి దంపతులు స్థాపించిన ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారంతో పాటు వృద్ధులకు, దివ్యాంగులకు నెలవారి పింఛన్ పంపిణీ, నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం పేద విద్యార్థుల విద్య, ఆర్థిక సహాయం, ఆలయాల నిర్మాణాలకు తగిన సహాయం అందించడం తదితర ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని 22వ వార్డు కార్పొరేటర్ కే.హనుమంతప్ప ప్రశంసించారు. ఆ వార్డు పరిధిలో సదరు బీసీ ట్రస్ట్ డివిజన్ గాంధీనగర్‌లో దృష్టిహీన దివ్యాంగుడైన బీ.లింగన్నకు నెలవారి పింఛన్ ఆదేశ ప్రతిని పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సమాఖ్య చైర్‌పర్సన్ వనిత, సూపర్‌వైజర్ సంజీవ్, సంఘం సభ్యులు, ఆ ప్రాంత ప్రముఖులు, మహిళా జ్ఞాన వికాస సమన్వయ అధికారిణి ఆశా, స్థానిక సేవా ప్రతినిధి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.