
●హరోం హర.. చామరాజేశ్వర
ఆషాఢ మాసం, గురు పూర్ణిమ సందర్భంగా చామరాజనగరలో చరిత్ర ప్రసిద్ధ చామరాజేశ్వర ఆలయ రథోత్సవం గురువారం వేలాదిమంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లా నుంచే కాకుండా కేరళ, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకించి నూతన దంపతులు ఎక్కువగా పాల్గొని స్వామిని సేవించారు. తెల్లవారుజాము నుంచి పూజలు చేసి ఉదయం 11.30 గంటల నుంచి 12.15 గంట శుభ కన్యా లగ్నంలో తేరు ఉత్సవాన్ని జరిపారు.
మైసూరు:
వాహనం బోల్తా.. కూలీలకు గాయాలు
మాలూరు : పికప్ వాహనం బోల్తాపడి 11 మంది కూలీలు గాయపడిన ఘటన మాలూరు – మాస్తి మెయిన్ రోడ్డులో రాజేనహళ్లి క్రాస్ వద్ద చోటు చేసుకుంది. తాలూకాలోని లక్కూరు ఫిర్కా డీఎన్ దొడ్డి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని బండహట్టి గ్రామానికి చెందిన 11 మంది కూలీలు కొత్తమిర పీకడానికి బొలెరోపికప్ వాహనంలో వెళ్తుండగా రాజేనహళ్లి క్రాస్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. గాయపడిన కూలీలను నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

●హరోం హర.. చామరాజేశ్వర

●హరోం హర.. చామరాజేశ్వర