
గ్రెనేడ్ పేల్చి ఉగ్రవాదిని తప్పించాలి
బనశంకరి: కటకటాల్లోని ఉగ్రవాదులతో కుమ్మక్కయిన బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మానసిక వైద్యుడు నాగరాజ్, ఏఎస్‌ఐ చాంద్‌పాషా, అనుమానిత ఉగ్రవాది తల్లి ఫాతిమాను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టారు. జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న ఉగ్రవాది నాసీర్ తప్పించుకోవడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. గ్రెనేడ్ నాసీర్ ను బయటికి తీసుకురావడానికి ప్లాన్ వేశారని ముగ్గురు నిందితులు తెలిపారు. ఎన్‌ఐఏ తాజా దాడులతో ఈ కుట్ర విఫలమైంది. నాసీర్ గత 2009 నుంచి పరప్పన జైలులో ఖైదీగా ఉన్నాడు. అతన్ని తప్పించడానికి ఉగ్రవాదులు రెండుసార్లు విఫలయత్నం చేసినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.
కోర్టుకెళ్లే సమయంలో..
దీనికి ఏఎస్‌ఐ చాంద్‌పాషా ప్రముఖ సూత్రధారి. పోలీసులు ఏఎస్‌ఐ చాంద్‌పాషాకు నాసీర్ ను కోర్టుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కోర్టుకు తీసుకెళ్లే దారిలో ఉగ్రవాదులు గ్రెనేడ్ పేల్చి పోలీసుల దృష్టి మళ్లించి నాసీర్‌ను తీసుకుపోవాలన్నది కుట్ర. ఫాతిమా, పరారీలో ఉన్న ఆమె కొడుకు జునైద్ దీనిపై చర్చించుకున్నారు. జునైద్ ద్వారా కుట్రదారులకు గ్రెనేడ్ పంపారు. 2023లో సీసీబీ కొడిగేహళ్లి జునైద్ తదితరుల ఇంట్లో తనిఖీలు చేయగా నాలుగు గ్రెనేడ్లు లభించడం కుట్రకు ఊతమిచ్చింది. ఉగ్రవాదులు ఏం చేయాలన్నా చాంద్‌పాషా సహాయం చేశారు.
అనుచరుల కుట్ర గుట్టురట్టు
ఎన్‌ఐఏచే ముగ్గురు నిందితుల విచారణ