
మోక్షదాతా.. గురుదేవా, పాహిమాం
బనశంకరి: గురు పౌర్ణమి సందర్భంగా గురువారం బెంగళూరుతో సహా ప్రముఖ దేవస్థానాల్లో విశేష పూజలు, ఉత్సవాలు జరిగాయి. సరస్వతీ, వినాయక, విష్ణు, పరమేశ్వర, రాఘవేంద్రస్వామి, వ్యాస– వాల్మీకి, సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తజనం బారులు తీరి దర్శించుకున్నారు. బెంగళూరులో వివిధ ఆలయాలలో అభిషేకం, మహామంగళ హారతి, పల్లకీ సేవలు, సత్యనారాయణస్వామి పూజలు చేపట్టారు. విజయనగరలో బసవేశ్వర సుజ్ఞాన మండపంలో ఇష్టలింగ మహాపూజ చేశారు. చామరాజపేటే శృంగేరి శంకర మఠంలో పూజలు, ప్రవచనాలు జరిగాయి. మల్లేశ్వరంలోని సాయిబాబా మందిరంలో, 15వ క్రాస్‌లోని షిరిడి సాయి ఆలయంలో, వాసవి మందిరం, జక్కూరు సాయిబాబా గుడి తదితర చోట్ల భక్తులు వెల్లువెత్తారు.
భక్తిశ్రద్ధలతో గురు పూర్ణిమ

మోక్షదాతా.. గురుదేవా, పాహిమాం