
రాయచూరు జెడ్పీ సీఈఓగా నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండే కలబుర్గి డివిజనల్ విద్యా శాఖ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో కారవార జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆయన విధులకు హాజరయ్యారు. జిల్లాలో భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృవందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా కాడ్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం భారత జ్ఞాన విజ్ఞాన సమితి, వాసవి వనితా సేవా సమితి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వాసవి వనితా సేవా సమితి కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి కల్పించిన యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత జ్ఞాన విజ్ఞాన సమితి సంచాలకుడు హఫీజుల్లా, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు రూ.2.5 కోట్ల భూమి దానం
హొసపేటె: ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం కోసం ఒక రైతు కోట్ల విలువైన భూమిని దానంగా ఇచ్చిన ఘటన తాలూకాలోని హంపనకట్టెలో జరిగింది. గ్రామంలో ఎల్‌కేజీ, యూకేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో తాలూకాలో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. పాఠశాలలోని 14 గదుల్లో 750 మందికి పైగా పిల్లలు చదువుకోవాల్సి ఉంది. విద్యార్థులకు సరైన పాఠశాల భవనం, గదులు లేకుండా పోవడంతో స్థల యజమాని అమరేష్‌గౌడ పాఠశాల నిర్మాణం కోసం రూ.2.5 కోట్ల విలువైన ఒక ఎకరం భూమిని దానంగా ఇచ్చారు.

రాయచూరు జెడ్పీ సీఈఓగా నియామకం

రాయచూరు జెడ్పీ సీఈఓగా నియామకం