
సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్సార్
బనశంకరి: ఆరోగ్యశ్రీ రూపకర్త, జలయజ్ఞ ప్రదాత, సంక్షేమ పథకాల సారథి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్ట్‌లో కేక్ కట్ చేసి వృద్ధులకు, పిల్లలకు అందజేశారు. పిల్లలు, విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు అందజేసి, అన్నదానం నిర్వహించారు.
అందరి జీవితాల్లో వెలుగు
వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, జలయజ్ఞంతో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని, అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత డాక్టర్ వైఎస్సార్ ఒక్కరే అని కొనియాడారు.
పాల్గొన్న నేతలు
ఈ కార్యక్రమంలో కడప జిల్లా వైఎస్సార్‌సీపీ ఐటీవింగ్ అధ్యక్షుడు కుమారస్వామిరెడ్డి, వైఎస్సార్‌ీసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లయన్ భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఐటీవింగ్ రాష్ట్ర ప్రతినిధి జగన్ పూసపాటి, ఐటీ వింగ్ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తంబళ్లపల్లి ఐటీవింగ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కర్ణాటక డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామ్ సుదేశ్‌రెడ్డి, రామ్ పులివెందుల, సతీశ్‌చంద్ర, విజయరాఘవరెడ్డి, కేశవరెడ్డి, పూల సురేంద్రరెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. కాగా, పలుచోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు మహా నేత జయంతిని జరిపించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
బెంగళూరులో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
పాల్గొన్న ఐటీ వింగ్ సభ్యులు,
అభిమానులు

సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్సార్

సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్సార్