
డిమాండ్లు తీర్చాలని పాలికె ఉద్యోగుల ధర్నా
హుబ్లీ: వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పాలికె ఉద్యోగులు మంగళవారం సామూహికంగా విధులకు గైర్హాజరు కావడం ద్వారా ఆందోళన చేపట్టారు. 7వ వేతన కమిషన్ సౌకర్యాన్ని విస్తరించాలి. పాలికె బృందం నియామక నియమాలను సవరించాలి. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పాలికె సిబ్బందికి ఆరోగ్య జ్యోతి, ఆరోగ్య సంజీవిని అమలు చేయాలి. ఉద్యోగులకు పదోన్నతిని ఇవ్వాలి. పాలికె ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా కూటమి నిర్వహించాలి. టీజీ ఐడీ, జీపీఎస్ సౌలభ్యాన్ని పాలికె సిబ్బందికి విస్తరించాలని సదరు ఉద్యోగులు డిమాండ్ చేశారు.