
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
రాయచూరు రూరల్: ఏకాదశి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నగరంలోని ప్రభుత్వ ఉద్యాన వనంలో విఠలరుక్మిణి అలయంలో పాండురంగ, రుక్మిణి స్వామివార్లకు విశేష అలంకరణలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారు, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 18న ప్రత్యేక ఆషాఢ మాస ఉత్సవాలు చేపడుతామని అలయ కమిటీ తెలిపింది. నగరేశ్వరాలయంలో పాండురంగ, రుక్మిణి దేవి ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం ఊంజల్ సేవలు నిర్వహించారు.
అణగారిన వర్గాల
ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
రాయచూరు రూరల్: మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్ నితీష్, శాసనసభ్యుడు శివరాజ్ పాటిల్ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ పుణ్యస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహనికి కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతి, కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేయడంతోపాటు దేశంలో మరిత విప్లవాన్ని సృష్టించిన మహాన్ మేధావి జగ్జీవన్‌రామ్ అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండ్వే, అసిస్టెంట్ కమిషనర్ గజానన, సాంఘిక శాఖ అధికారి చిదానంద, నగరసభ కమిషనర్ జుబీన్ పాత్రో, తహసీల్దార్ సురేష్‌వర్మ, రాజేంద్ర జాలదార్ పాల్గొన్నారు.
పెరుగుతున్న
పశువుల చోరీలు
హుబ్లీ: ధార్వాడ తాలూకా హొసవాళ, రామపుర గ్రామాలలో పశువులు, మేకలు, గొర్రెల చోరీ ఘటనలు పెరుగుతున్నాయి. ఇంటి ముందు కట్టేసిన మేకలు, పొట్టెళ్లు, పశువులను దుండగులు చోరీ చేసి ఉడాయిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారి ఇళ్లపై కన్నేసిన దొంగల ముఠాలు బైక్‌పై వచ్చి పొట్టెళ్లను చోరీ చేస్తున్నారు. దీంతో మేకల కాపరులు, పాడి రైతులు కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారు. హొసవాళ గ్రామంలో వాసు ఉళికేరి అనే వ్యక్తికి చెందిన ఆవును, అదే గ్రామానికి చెందిన దాదాపీర దొడ్డమని ఇంటి ముందు కట్టిన పొట్టెళ్లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు వాపోయారు. పట్టపగలే బైక్ మీద పొట్టెళ్లను తరలిస్తున్న దృశ్యం బేలూరులోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ దృశ్యాలతోసహా సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చినా స్పందన లేదని పొట్టేళ్ల యజమాని వాపోతున్నాడు.
రంగసిరి కార్యక్రమాలు
పట్టణాలకూ విస్తరించాలి
రాయచూరురూరల్: సమాజానికి నిస్వార్థంతో సేవలు అందించినప్పుడే సార్థకత ఉంటుందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అన్నారు. పండిత సిద్దరామ జం బలదిన్ని రంగ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన రంగసిరి సాంస్కృతిక కార్యక్రమాలను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో అదరణ కలిగిన రంగసిరి కార్యకలాపాలను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలన్నారు. రంగస్వామి, నాగవేణి, పవన్ పాటి ల్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, శ్రీనివాస్, గోవిందు, బిరదార్ పాల్గొన్నారు.
ఏసుక్రీస్తు బోధనలు
మానవాళికి మార్గదర్శనం
హుబ్లీ: లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలు మానవజాతిని సరైన మార్గంలో నడిపిస్తాయని సింధనూరు గేట్సే మనె ప్రార్థన మందిరం దైవజనులు హరీష్ అన్నారు. సింధనూరు సమీపంలోని దుర్గ క్యాంప్‌లో సీనియర్ ఫాస్టర్ ఏసు రత్నం సారథ్యంలో రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక ప్రార్థన కూటమిలో ఆయన పాల్గొని బైబుల్‌లోని సందేశాలను వినిపించారు. ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవులు ఆచరించి తమ జీవితాలను సార్థకంచేసుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని ఆయన వివరించారు.

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి