
రెండు సర్కిళ్ల అభివృద్ధికి చర్యలు
రాయచూరు రూరల్: నగరంలోని అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ సర్కిళ్లను అధునాథనంగా అభివృద్ధి చేస్తామని కకలెక్టర్ నితీష్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహనీయుల విగ్రహాలు, రాజ్యంగ పుస్తకం, పార్లమెంట్ నమూనాను 3డీ సాంకేతికతతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ పార్క్, బారికేడ్ గోడ, అంబేడ్కర్ భవనం నిర్మాణాలు, అందోళన కార్యక్రామాలకు స్థలం కేటాయించాలని సంఘం సభ్యులు కోరారు. సభలో ఎస్పీ పుట్ట మాదయ్య, కమిషనర్ జుబీన మోహపాత్రో, చిదానంద, పరుశురామ్, బసవరాజ్, బీ మయ్య, వసంత్ కుమార్, విశ్వనాథ్, విరుపాక్షి పాల్గొన్నారు.

రెండు సర్కిళ్ల అభివృద్ధికి చర్యలు