పరిసరాలను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను సంరక్షించాలి

Jul 6 2025 6:59 AM | Updated on Jul 6 2025 6:59 AM

పరిసర

పరిసరాలను సంరక్షించాలి

రాయచూరు రూరల్‌: పరిసరాల సంరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని గ్రీన్‌ సంచాలకుడు ఈరన్న పిలుపునిచ్చారు. భోళమాను దొడ్డి ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో వేడిమినుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఇంటిి ముందు మొక్కలు పెంచి సంరక్షించాలన్నారు.

పీర్ల దేవుళ్లకు

హిందువులే అర్చకులు

రాయచూరు రూరల్‌: ఆ గ్రామంలో మైనార్టీలు లేకపోయినా పీర్ల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. హిందువులే పీర్ల దేవళ్లకు పూజలు నిర్వహిస్తారు. మతసామరస్యానికి ప్రతీక అయిన ఈ గ్రామం కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని యాదగిరి జిల్లా సురుపుర తాలూకాలో ఉంది. తళవార గ్రామంలో మైనార్టీలు ఒక్కరు కూడా లేరు. ఊరంతా హిందువులే. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండుగలతో పాటు వందేళ్లుగా మొహర్రంను ఆచరిస్తున్నారు. ఆరు రోజలు పాటు జరిగే మొహర్రం వేడుకల్లో హసేని, సయ్యద్‌ ఖాసీం, లాలసాబ్‌, మౌలాలీ పీర్లను కొలువు దీర్చి పూజలు చేస్తారు.ఈ గ్రామంలోని హిందువులతోపాటు పక్క గ్రామాలనుంచి హిందు, ముస్లింలు వచ్చి ఇక్కడ పీర్ల దేవుళ్లను దర్శించుకొని స్వామివారికి చక్కెర, కొబ్బెర చదివిస్తారు. ఈ ఏడాది కూడా మొహర్రం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ద్విభాషా విధానం

అమలు చేయాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో విద్యాశాఖలో ద్విభాష విధానాన్ని అమలు చేయాలని కరవే డిమాండ్‌ చేసింది. జిల్లాదికారికార్యాలయం వద్ద శనివారం అందోళన చేపట్టిన అధ్యక్షుడు గంగణ్ణ మాట్లాడుతూ ప్రస్తుతం త్రిభాషా సూత్రం వల్ల విద్యార్థులు హిందీ భాషలో అధికశాతం ఉత్తీర్ణులు కాలేక పోతున్నారన్నారు. 1968లో తమిళనాడు హిందీభాషను రద్దు చేయగా మహారాష్ట్రలో కూడా హిందీని తొలగించారన్నారు. కర్ణాటకలో కూడా హిందీని రద్దు చేసి ద్విభాషా విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.

రోటరీ సేవలు విస్తరింపజేస్తాం

రాయచూరురూరల్‌: రోటరీ క్లబ్‌ సేవలు విస్తరింపజేస్తామని జిల్లా రోటరీ గవర్నర్‌ తిరుపతి నాయుడు అన్నారు. నగరంలోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో శనివారరం జరిగిన రోటరీ క్లబ్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో ఇప్పటికే గణనీయమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఇతర రంగాల్లో కూడా సంస్థ సేవలు అందించాల్సి ఉందన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతో

రోగికి రక్తస్రావం

జిమ్స్‌ ఆస్పత్రిలో ఘటన

హుబ్లీ: కలబుర్గి జిమ్స్‌ ఆస్పత్రిలో మరో నిర్లక్ష్య ఘటన వెలుగు చూసింది. ఐసీయూలో ఉన్న రోగికి గ్లూకోజ్‌ పైపు తొలగిపోవడంతో రక్తస్రావమైంది. జిల్లాలోని మెలకుంద గ్రామ నివాసి సిద్దన్న నాలుగు రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని జిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచారు. ఆయనకు పెట్టిన గ్లూకోజ్‌ పైపు పక్కకు తొలగిపోవడంతో రక్తస్రావమైంది. అయినా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీయగా సిద్దన్నకు గుండెపోటు వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితుడు కుటుంబ సభ్యులు వాపోయారు.

పరిసరాలను సంరక్షించాలి 1
1/3

పరిసరాలను సంరక్షించాలి

పరిసరాలను సంరక్షించాలి 2
2/3

పరిసరాలను సంరక్షించాలి

పరిసరాలను సంరక్షించాలి 3
3/3

పరిసరాలను సంరక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement