ఫ్లై ఓవర్‌ గోడెక్కిన బస్సు | Sakshi
Sakshi News home page

ఫ్లై ఓవర్‌ గోడెక్కిన బస్సు

Published Sun, May 19 2024 4:45 AM

ఫ్లై ఓవర్‌ గోడెక్కిన బస్సు

నెలమంగల వద్ద ప్రమాదం

దొడ్డబళ్లాపురం: అదుపు తప్పిన కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఫ్లై ఓవర్‌ అడ్డుగోడపైకి ఎక్కింది.

అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన నెలమంగల వద్ద చోటుచేసుకుంది. సోమవారపేట నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సు నెలమంగల– బెంగళూరు హైవేలో అడకమారనహళ్లి వద్ద 40 అడుగుల ఎత్తైన ఫ్లై ఓవర్‌ వంతెనపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అడ్డుగోడపైకి ఎక్కి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో కలిసి ఆరుమందికి గాయాలయ్యాయి. బస్సు ఆ వంతెన మీద నుంచి కిందకు పడిఉంటే పెద్ద దారుణమే జరిగేది. ప్రయాణికులు ఈ ప్రమాదంతో భయాందోళనకు గురయ్యారు. నెలమంగల ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది జేసీబీని రప్పించి బస్సును జాగ్రత్తకు రోడ్డు మీదకు తెచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement