నీటిలో మునిగి యువతి మృతి | Sakshi
Sakshi News home page

నీటిలో మునిగి యువతి మృతి

Published Tue, Dec 26 2023 1:42 AM

- - Sakshi

దొడ్డబళ్లాపురం: హేమావతి నదిలో మునిగి యువతి మృతి చెందిన విషాద ఘటన హాసన్‌ తాలూకా గోరూరులో చోటుచేసుకుంది. అరళికట్టె గ్రామానికి చెందిన నిత్య(19) హనుమజయంతి సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చింది. గ్రామ శివారులో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి పూజ చేసింది. అనంతరం సరదాగా హేమావతి నది కాలువలోకి దిగింది. లోతుగా ఉన్న చోట ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందింది. అగ్నిమాపకదళ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. గొరూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement