ఉగ్ర స్లీపర్‌ సెల్‌గా బెంగళూరు : హోంమంత్రి | Sakshi
Sakshi News home page

ఉగ్ర స్లీపర్‌ సెల్‌గా బెంగళూరు : హోంమంత్రి

Published Tue, Dec 19 2023 12:46 AM

-

బనశంకరి: బెంగళూరు మొదటి నుంచీ ఉగ్రకార్యకలాపాలకు స్లీపర్‌సెల్‌ అని ప్రచారంలో ఉందని హోంమంత్రి జీ.పరమేశ్వర్‌ అన్నారు. నగరంలో ఎన్‌ఐఏ దాడుల గురించి ఆయన సోమవారం స్పందిస్తూ స్లీపర్‌ సెల్స్‌ గురించి తెలిసి సోదాలు జరుగుతూ ఉండవచ్చన్నారు. ఎన్‌ఐఏ దక్షిణాది ఆఫీసు బెంగళూరులోనే ఉంది, కొన్నిసార్లు మాతో సంప్రదిస్తారు, మరికొన్ని సార్లు సంప్రదించకుండానే దాడులు చేస్తుంటారని అన్నారు. బెంగళూరు వాతావరణం బాగుండడం వల్ల చాలామంది ఇక్కడకి వస్తారని, అలాగే ఉగ్రవాదులు కూడా తలదాచుకుని ఉంటారన్నారు. ఇటీవల ఎన్‌ఐఏ చాలా క్రీయాశీలకంగా మారిందని, వారి విధులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement