వైభవంగా సూగూరేశ్వర జాతర | Sakshi
Sakshi News home page

వైభవంగా సూగూరేశ్వర జాతర

Published Tue, Dec 19 2023 12:44 AM

రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బసనగౌడ  - Sakshi

రాయచూరు రూరల్‌: తాలూకాలోని దేవసూగూరులో సూగూరేశ్వర జాతర ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దేవసూగూరు ఆలయం నుంచి నాగర యల్లమ్మ ఆలయం వరకు మిహిళలు కుంభ కలశాలతో ఊరేగించారు. వీరగాసె నృత్యం చేస్తూ ఒడుపులు చెబుతూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తెల్లవారు జామున కృష్ణా నది నుంచి నీటిని తెచ్చి జలాభిషేకం చేశారు. సూగూరే శ్వరుడికి, భద్రకాళికి వివాహం జరిపారు. సాయంత్రం సూగూరేశ్వర జోడు రథోత్సవాలను వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ రథోత్సవంలో పాల్గొని తన మొక్కు తీర్చుకున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని బైకిస్టు మృతి

బళ్లారి రూరల్‌: తాలూకాలోని వక్రాణి క్యాంపు వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైకిస్టు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వివరాలు.. కోళూరుకు చెందిన తిప్పేష్‌(40) వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తుండేవాడు. ఉదయం తన బైక్‌పై బళ్లారికి వస్తుండగా వక్రాణి క్యాంపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తిప్పేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని విమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement