ఆర్టీసీ బస్సు– స్కూలు బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు– స్కూలు బస్సు ఢీ

Published Thu, Dec 7 2023 12:12 AM | Last Updated on Thu, Dec 7 2023 12:12 AM

ప్రమాదంలో నుజ్జయిన స్కూల్‌ బస్సు - Sakshi

హోసూరు: హోసూరు– బాగలూరు రోడ్డులో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ పాఠశాల బస్సు నేరుగా ఢీకొన్న ప్రమాదంలో 10 మందికిపైగా గాయపడ్డారు. వివరాల మేరకు బాగలూరు నుంచి ప్రయాణికులను తీసుకెళుతున్న ఆర్టీసీ బస్సు హోసూరు వైపు నుంచి విద్యార్థులతో వస్తున్న విజయ్‌ విద్యాలయ బస్సు ఎలువపల్లి వద్ద బుధవారం ఉదయం ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌, స్కూల్‌ బస్సులోని విద్యార్థులతో పాటు పది మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అదే తోవలో వస్తున్న మాజీ మంత్రి పి. బాలక్రిష్ణారెడ్డి, స్థానిక ప్రజలు కలిసి బాధితులను వాహనాల్లో హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరువాత మాజీ మంత్రి ఆస్పత్రికెళ్లి బాధితులను పరామర్శించారు. పిల్లల తల్లిదండ్రులు ఏం జరిగిందోనని ఆందోళనతో విలపించారు. ఈ ఘటనతో బాగలూరు సమీపంలో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. బాగలూరు పోలీసులు వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను సరిచేశారు.

విద్యార్థులు సహా 10 మందికి గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement