కిడ్నాప్‌, హత్యపై దర్యాప్తు | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌, హత్యపై దర్యాప్తు

Published Thu, Dec 7 2023 12:12 AM

-

దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణకు చెందిన ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్‌ బావ మహదేవయ్య హత్య తెలిసినవారిపనేని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈకోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మహదేవయ్య బంధువులు, స్నేహితులను విచారిస్తున్నారు. త్వరలోనే నేరస్తుల వివరాలు వెల్లడిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మహదేవయ్య కిడ్నాప్‌నకు గురైన సమయంలో ఇంటిలో ఎలాంటి పెనుగులాట,గొడవ జరగలేదని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, నగలు గల్లంతైనట్లు సమాచారం. మహదేవయ్య అంత్యక్రియలు మంగళవారం చెన్నపట్టణ తాలూకా వడ్డరదొడ్డి గ్రామంలోని మహదేవయ్య తోటలో ముగిశాయి.

Advertisement
 
Advertisement