రెండవ భార్యతో  వివాహేతర సంబంధం..  వ్యక్తి హత్య  | Sakshi
Sakshi News home page

రెండవ భార్యతో  వివాహేతర సంబంధం..  వ్యక్తి హత్య 

Published Mon, Nov 27 2023 1:04 AM

- - Sakshi

శ్రీనివాసపురం: పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిని కొడవలితో నరికి చంపిన ఘటన శనివారం రాత్రి ముళబాగిలు తాలూకా మిణజేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హతుడిని సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న మంజునాథ్‌ (48)గా గుర్తించారు. మంజునాథ్‌ బంగారుపేట తాలూకా మాదముత్తన హళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తితో తరచుగా గొడవ పడుతుండేవాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. మంజునాథ్‌ రెండవ భార్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంజునాథ్‌ తన మొదటి భార్యతో దూరంగా ఉండి రెండవ భార్య నేత్రతో కలిసి ఉంటున్నాడు. నేత్ర, ఆమె ప్రియుడు కలిసి తన భర్త మంజునాథ్‌ను హత్య చేశారని మొదటి భార్య సౌభాగ్యమ్మ ఆరోపిస్తోంది. అయితే రూ. 40 వేల కోసం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని బంధువులు చెబుతున్నారు. మృతుడి మామ నాగరాజ్‌ ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement