జూనియర్‌కు వేధింపులు, న్యాయవాది సస్పెండ్‌ | Sakshi
Sakshi News home page

జూనియర్‌కు వేధింపులు, న్యాయవాది సస్పెండ్‌

Published Sun, Nov 26 2023 12:58 AM

-

శివాజీనగర: తన జూనియర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై లాయర్‌ను రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సస్పెండ్‌ చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో 46 ఏళ్ల న్యాయవాదిపై మహిళా జూనియర్‌ న్యాయ వాది బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడి ప్రవర్తనతో ఆమె అదే ఏడాది సెప్టెంబర్‌లో బయటకు వచ్చేసింది. ఆ తరువాత కూడా సీనియర్‌ న్యాయవాది బ్లాక్‌ మెయిల్‌ చేశారని బాధితురాలు ఆరోపించింది.

ఫిర్యాదు పరిశీలన:

ఫిర్యాదు చేసిన ఆధారాలు, ఆరోపణలు బార్‌ కౌన్సిల్‌ పరిశీలించింది. వాట్సప్‌ సందేశాలు ఫిర్యాదుదారుల గురించి స్పందించిన న్యాయవాది వృత్తిపరం కాని విధానాన్ని చూపిస్తాయనేది స్పష్టమైంది. నిందితుడు న్యాయవాది తనకు వ్యతిరేకంగా సమర్పించిన ఫిర్యాదుకు సంబంధించి వివరణ సమర్పించేందుకు ఈ ఏడాది అక్టోబర్‌ 5 వరకు సమయం కోరాడని వెల్లడించాయి. అయితే 30 రోజుల వ్యవధి పూర్తయిన ప్రతివాది బార్‌ కౌన్సిల్‌ ప్రాధికార ముందు ఎలాంటి వివరణ గాని ఎలాంటి అభ్యంతరాలను సమర్పించుటలో విఫలమయ్యారని నమోదు చేశారు. ఇటీవల బార్‌ కౌన్సిల్‌ విధానాల ప్రకారం ప్రతివాది విచారణకు రాకపోవడంతో సస్పెండ్‌ చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement