కావేరి నదిలో మృత్యు ఘోష | Sakshi
Sakshi News home page

కావేరి నదిలో మృత్యు ఘోష

Published Mon, Nov 20 2023 12:28 AM

నంజుండ, జ్యోతి మృతదేహాలు  - Sakshi

మండ్య: ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా నదీ స్నానాలు చేసేందుకు విచ్చేసినవారిని మృత్యువు కబళించింది. నీటిలోకి దిగిన వారిలో ఇద్దరు జల సమాధి అయ్యారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన కేఆర్‌ఎస్‌ డ్యాంలో చోటు చేసుకుంది. మైసూరులోని కారుణ్య ట్రస్టుకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం కేఆర్‌ఎస్‌కు వచ్చారు. వెనుక కాలువ సమీపంలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకొని అక్కడ జలాశయంలోకి దిగారు. కొందరు ఈత కొడుతుండగా మరికొందరు స్నానాలు చేస్తున్నారు. ఈక్రమంలో హరీష్‌ (32), నంజుండ (18), జ్యోతి (18)లు నీటిలో మునిగిపోయారు. జలాశయ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో గజ ఈతగాళ్లు వచ్చి గాలించగా జ్యోతి, నంజుండ శవాలు దొరికాయి. హరీష్‌ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనతో తోటివారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

స్నానాలకు వచ్చి ఇద్దరి మృతి, మరొకరు గల్లంతు

1/1

Advertisement
 
Advertisement