బెంగళూరు సురక్షితమా? | Sakshi
Sakshi News home page

బెంగళూరు సురక్షితమా?

Published Fri, Nov 17 2023 1:08 AM

ఐటీ సిటీలో వనితల భద్రతపై సందేహాలు  - Sakshi

యశవంతపుర: బెంగళూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు సరైన భద్రత లేదని, ఇందుకు తన భార్య ఎదుర్కొన్న వేధింపులే కారణమని సైజన్‌శెట్టి అనే వ్యక్తి ఎక్స్‌లో వీడియోను పోస్టు చేసి పోలీసులకు ట్యాగ్‌ చేశారు. వివరాలు.. ఈ నెల 8న నా భార్య పనులు ముగించుకొని క్యాబ్‌ కోసం ఎదురు చూస్తుండగా ఆలస్యమైంది. ఇద్దరు మహిళా సహోద్యోగులు, ఒక పురుషునితో కలిసి కారు ఎక్కింది. సర్జాపుర వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఓ టెంపో డ్రైవర్‌ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. తప్పు జరిగిందంటూ టెంపో డ్రైవర్‌ నాటకం ఆడాడు. తరువాత కారులోని మహిళలను బెదిరించాడు. నా భార్య ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి బెదిరించిన గ్యాంగ్‌ నుంచి బయట పడింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఎవరూ కూడా భార్యకు సాయం చేయలేదు. ఇదే మార్గంలో ఐటీ సంస్థలున్నాయి. సరైన భద్రత లేక అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. కాగా ఘటన జరిగిన స్థలంతో పాటు వివరాలు తెలపాలని బెంగళూరు పోలీసులు అతనికి సూచించారు.

రాత్రి సమయాల్లో మహిళలకు ఇబ్బందులు

భార్యకు ఎదురైన వేధింపులపై ఓ భర్త ఆవేదనాభరిత పోస్టు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement