బనశంకరి సన్నిధిలో దీపోత్సవం | Sakshi
Sakshi News home page

బనశంకరి సన్నిధిలో దీపోత్సవం

Published Tue, Nov 14 2023 1:00 AM

- - Sakshi

బనశంకరి: వెలుగు పూల పండుగ దీపావళి సందర్భంగా బనశంకరీదేవి సన్నిధిలో దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఆదివారం వేకువ జామున సుప్రభాతసేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బనశంకరీదేవికి అర్చనలు, అభిషేకం చేపట్టి అమ్మవారి మూలవిరాట్‌కు విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. దీపోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్‌, ఆలయ ఈఓ లక్ష్మీ లాంఛనంగా ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపోత్సవంతో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక శోభ సంతరించుకుంది.

ప్రత్యేక అలంకరణలో బనశంకరీదేవి మూలవిరాట్‌, ఆలయంలో దీపాల వెలుగులు
1/1

ప్రత్యేక అలంకరణలో బనశంకరీదేవి మూలవిరాట్‌, ఆలయంలో దీపాల వెలుగులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement